మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (16:53 IST)

తీవ్ర అస్వస్థతకు లోనైన హాస్య నటుడు సునీల్

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో అయిన సునీల్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా, ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సునీల్‌ను మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ఇటీవలికాలంలో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడటం వల్లే సునీల్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం సునీల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సునీల్ వ్యక్తిగత సిబ్బంది మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, సీజనల్‌గా వచ్చే జ్వరమే అని చెబుతున్నారు. అయితే సునీల్ ఆసుపత్రిలో ఉన్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సునీల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆయన అభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు.