గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (12:29 IST)

కాళ్ళపారాణి ఆరకముందే భర్తకు విషమిచ్చిన భార్య.. ఎక్కడ?

కాళ్ళపారాణి ఆరకముందే ఓ భార్య కట్టుకున్న భర్తకు విషమిచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకు.. అదే జిల్లాకు చెందిన మదనంతపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. 
 
వీరి వివాహం జరిగిన వారం రోజులకు అత్తవారి ఇంటికి వెళ్లిన లింగమయ్యకు.. భార్య పాలల్లో విషం కలిపి ఇచ్చింది. అవి తాగిన భర్త అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లింగమయ్య సోదరుడు అతడిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
లింగయ్య శరీరంలో విషం ఉందనీ, మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో లింగయ్యను అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.