పాపమని రక్షిస్తే చేతిని కొరికేసింది.. మద్యంమత్తులో యువతి హల్‌చల్
మద్యంమత్తులో ఓ యువతి హల్‌చల్ సృష్టించింది. పీకల వరకు మద్యం రోడ్డుపై అపస్మారకస్థితిలో పడివున్న యువతిని పోలీసులు పాపంభీతికెళ్లి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఓ ఎస్సై, ముగ్గురు లేడీ కానిస్టేబుళ్ళపై దాడికి దిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహీరానగర్‌లో సదరు యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికుల సమాచారంతో ఆమెను బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చారు.
కొద్దిసేపటికి కళ్లు తెరిచిన ఆమె.. పోలీసులను అభ్యంతరకర రీతిలో తిట్టడం ప్రారంభించింది. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా ఎస్సైపై దాడి చేసింది. మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను కొట్టింది. ఓ కానిస్టేబుల్ చేతిని కొరికి, మెడపై రక్కి నానా రభస చేసింది.
అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుండగా.. ఎలాగోలా ఆమెను పోలీసులు అడ్డకున్నారు. దర్యాప్తులో ఆమెను నాగాలాండ్‌కు చెందిన లీసాగా గుర్తించారు. మాదాపూర్‌లో పని చేస్తుందని తెలిసింది. ఆమెను సంబంధీకులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె మద్యం సేవించిందా.. డ్రగ్స్ తీసుకుందా తేలాల్సి ఉంది.