సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2019 (10:04 IST)

తమిళ పాలిటిక్స్‌లోకి ఎట్రీ! ఉదయనిధి స్టాలిన్‌తో ఏకాంతంగా? శ్రీరెడ్డి ఏమంటున్నారు?

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె త‌మిళ హీరో, స్టాలిన్ రాజ‌కీయ వార‌సుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌పై వ్యాఖ్యలు చేస్తూ చేసిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్లో ఉద‌య‌నిధి స్టాలిన్ త‌న‌తో ఏకాంతంగా గ‌డిపాడంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. 
 
దీంతో చెన్నైలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ తాను అసలు ఉదయనిధిని ఇప్పటివరకు నేరుగా కూడా చూడలేదని, తన పేరుతో అనేక నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయనీ, వాటిలో ఒక ఖాతా నుంచి ఈ పోస్టు విడుదలైందని చెప్పింది. ఈ అంశంపై ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పింది. 
 
ఎవరో కావాలనే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారంటూ మండిపడింది. త్వరలో రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని శ్రీరెడ్డి తెలిపింది. తమిళనాడులో ఒక ప్రముఖ పార్టీలో చేరబోతున్నానని, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడిస్తానని చెప్పింది.