శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (17:30 IST)

శ్రీరెడ్డి రచ్చ రచ్చ-సోషల్ మీడియాలో అందాల ఆరబోత (video)

వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వచ్చే శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోని నటులు, దర్శకనిర్మాతలపై శ్రీరెడ్డి విమర్శల వర్షం కురిపించింది. అంతేగాకుండా అప్పుడప్పుడు తోచిన వారిపై రాయేస్తూ వార్తల్లో నిలుస్తుంది. 
 
తాజాగా ఈ భామ తన రూటు మార్చింది. సినిమాల్లో ఎలాగో ఛాన్సులు రావని ఫిక్స్ అయిన ఈ భామ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలుపెట్టేసింది. తాజాగా శ్రీ రెడ్డి ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద కన్నేసింది. అంతేకాదు తాజాగా ర్యాంప్ వాక్ చేసి ఫ్యాన్స్‌కు మెసేజ్ పంపింది. పసుపు పచ్చ రంగు గౌన్‌లో అందాలను అరబోసింది. ఈ వీడియోతో పాటు ఫోటోలు సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.