గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (14:37 IST)

స్మార్ట్ ఫోన్‌లో మాట్లాడుతూ.. కొడుకును వదిలేసింది.. చివరికి ఏమైందంటే? (Video)

స్మార్ట్‌ఫోన్ చేతిలో వుంటే చాలు మనచుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని మరిచిపోతుంటారు చాలామంది. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ల వాడటం, సోషల్ మీడియాను చూస్తూ గడిపేయడం.. ఇంకా ఇతరులతో గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడే వారి సంఖ్య ప్రస్తుతం అమాంతం పెరిగిపోయింది. ఇలా తన కుమారుడితో వచ్చిన ఓ తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ.. బిడ్డను క్షణాల్లో కోల్పోయి వుంటుంది. 
 
కానీ క్షణాల్లో తేరుకుని పిల్లాడిని కాపాడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. కుమారుడితో కొడుకుతో కలిసి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ అక్కడే నిలబడ్డారు. ఇక పిల్లాడు తల్లి చేయి వదిలేసి పక్కనే ఉన్న మెట్ల దగ్గరకు వెళ్లి వాటికి ఉన్న రెయిలింగ్ పట్టుకుని వేలాడుతూ ముందుకు చూస్తూ వంగాడు. 
 
ఒక్కసారిగా కిందకు పడబోతుండగా ఇంతలో వెనక్కు తిరిగిన తల్లి గమనించి వెంటనే ఆ పిల్లాడి కాలు పట్టుకుని పైకి లాగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంది వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడున్న సీక్రెట్ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.