శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (17:03 IST)

ఆ రోజు రాత్రిని ఉదయనిధి స్టాలిన్ మరిచిపోరనుకుంటా: శ్రీరెడ్డి (Video)

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం సినిమా అవకాశాలు వచ్చినా సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కోలీవుడ్ నటుడిపై మళ్లీ వివాదాస్పద కామెంట్లు చేసింది. ఛాన్సులు ఇస్తామని పలువురు తనను వాడుకుని.. ముంచేశారని శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌ను వీడి కోలీవుడ్‌కు మకాం మార్చేసుకున్న శ్రీరెడ్డి అక్కడా నోటికి పని చెప్పింది.
 
ప్రముఖ దర్శకులు, నిర్మాతలపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌పై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేసింది. ఆ పోస్టులో ''హాయ్ తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ రెడ్డి ద్వారా పరిచయం అయ్యాం.
 
ఆ తర్వాత మీరు అవకాశం ఇప్పిస్తానని చెప్పి... గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా నాతో శారీరకంగా ఒక్కటయ్యారు. ఆ రాత్రంతా ఎన్నో చేశాం. అయితే ఇప్పటివరకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ మీరు ఆ రాత్రి నాతో గడిపిన విషయాన్ని మరిచిపోరనుకుంటాను'' అంటూ శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్లు చేసింది.