మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (09:54 IST)

నాన్న కారు ప్రమాదానికి గురయ్యాడు.. కానీ గాయాలు తగల్లేదు: శివాత్మిక

తన తండ్రి, సినీ హీరో డాక్టర్ రాజశేఖర్‌ కారు ప్రమాదానికి గురైన విషయంపై రాజశేఖర్ కుమార్తె శివాత్మిక స్పందించారు. తన తండ్రి కారు ప్రమాదానికి లోనైన మాట నిజమేనని స్పష్టం చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. 
 
సినీ నటుడు రాజశేఖర్ బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాజశేఖర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. 
 
ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై రాజశేఖర్ కుమార్తె, సినీ నటి శివాత్మిక స్పందించారు
 
'నాన్న ప్రమాదానికి గురైన విషయం నిజం. అయితే నాన్న అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాన్న బాగున్నారు. మీ అందరి ప్రేమకు, నాన్న త్వరగా కోలుకోవాలన్న మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు' అంటూ శివాత్మిక ట్వీట్ చేశారు.