శ్రీరెడ్డి న్యూ లుక్ వైరల్.. రైతుల కోసం ర్యాంప్ వాక్ చేసింది..
వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేసిన క్యాట్ వాక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చెన్నైలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె.. తనలోని గ్లామర్ మొత్తాన్ని ఒలకపోసింది. వివాదాలే కాదు.. గ్లామర్ కంటెంట్ తనలో టన్నుల లెక్కన ఉందన్నట్లుగా ర్యాంప్ మీద హోయలు పోయింది.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ఫ్యాషన్ షో రైతుల సంక్షేమం కోసం కావడం గమనార్హం. వారికోసం నిధులు సేకరించే నిమిత్తం ప్రవోలియన్ అనే సంస్థ చెన్నైలో ఫ్యాషన్ షోను నిర్వహించింది.
సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి లాంటి పలువురితో పాటు శ్రీరెడ్డి ర్యాంప్‌పై హోయలొలికించారు. అల్ట్రా మోడ్రన్‌గా తన భారీ అందాలను శ్రీరెడ్డి ఒలకపోసి కనువిందు చేసింది. తాజాగా తన ర్యాంప్ షోకు సంబంధించిన ఫోటోల్ని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.