సంబంధిత వార్తలు
- జగన్ ఆంధ్రా ఫిష్ అంటే.. అవినాష్ నాటుకోడి అంటున్నారు : బీటెక్ రవి
- అలాంటి అపవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం మనం తిన్నామా?: దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన
- దేవుడుతో పెట్టుకున్నావ్.. మీకు పుట్టగతులుండవ్ : జగన్‌కు సీఎం చంద్రబాబు హెచ్చరిక
- చంద్రబాబుకు వైఎస్సార్ అసెంబ్లీ క్షమాపణ చెప్పడం చూశాను.. గంటా శ్రీనివాస్
- Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్
వాట్.. శీనూ ది గ్రేట్... ఫ్యామిలీ రచ్చ ఎందుకబ్బా... దువ్వాడతో జగన్ వ్యాఖ్యలు
వైకాపా నుంచి సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్‌ను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలుకరించారు. వాట్.. శీనూ ది గ్రేట్ అంటూ కితాబిచ్చారు. పైగా, ఫ్యామిలీ రచ్చ ఎందుకు చేసుకుంటున్నావ్ అంటూ అడిగారు.
వైకాపా సభ్యులతో కలిసి జగన్ గురువారం ఏపీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ లాబీలో జగన్‌కు దువ్వాడ తారసపడ్డారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వాట్ శీనూ ది ద్రేట్ అంటూ దువ్వాడను జగన్ పలుకరించారు.
ఆ తర్వాత జగన్ దగ్గరకు వచ్చిన దువ్వాడ పాదాభివందనం చేయగా భుజం తట్టారు. ఇంకా సినిమా హీరోలాగే చేస్తున్నావా? బిజినెస్‌లు అవీ బాగానే ఉన్నాయా? ఫ్యామీ రచ్చ ఎందుకు చేసుకుంటున్నావు అని జగన్ అడిగారు. దీనికి దువ్వాడ సమాధానమిస్తూ, పర్సనల్ ఇష్యూస్ అన్నీ సెటిల్ చేసుకుంటున్నా అని సమాధానమిచ్చారు.
తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావ్ అని జగన్ అడగ్గా... నేనెక్కడికి వెళతాను. మీరేం చేబితే అదే. ఒకసారి మిమ్మలను కలిసి మాట్లాడతా అన దువ్వాడ అడిగ్గా సరే చూద్దాం అంటూ జగన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత దువ్వాడ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, తిరుమల లడ్డూ విషయంలో తాను శ్రీవారి భక్తుల వైపే ఉంటానని, సస్పెన్షన్ ఎత్తి వేయకపోతే ఏం చేస్తారని అడగ్గా.. ఎన్నికలకు చాలా సమయం ఉందని, అపుడు జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతంగానే పోటీ చేస్తా అని ఆయన చెప్పారు.
