శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (14:48 IST)

త్రిష, బిపాస బసు, శ్రియ.. వీరి తర్వాత రానాతో రకుల్ ప్రేమాయణం?

రకుల్ ప్రీత్ సింగ్, యంగ్ హీరో దగ్గుబాటి రానాతో లవ్ ఎఫైర్ సాగిస్తోందని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట లవ్ టాపిక్ పై హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి. అంతేకాదు ఈ బ్యూటీ రానా ఇంటిపక్కనే ఓ ఫ్లాట్ కూడా కొనేసిందట. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని వినిపిస్తోంది. కొంతకాలంగా ఇద్దరు సీక్రెట్‌గా లవ్ ఎఫైర్ సాగిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్, రానాతో లవ్ ఎఫైర్‌పై తడబడటం కూడా ఆసక్తిగా మారింది. అయితే ఇంటి పక్కనే ఇల్లు ఉన్నంత మాత్రాన మా మధ్య లవ్ ఉన్నట్టా అంటూ అమ్మడు రివర్స్ క్వశ్చన్ వేస్తోంది. రానా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే అంటోంది. రానాతో కలిసి నటించకపోయినా ఇద్దరి మధ్య థిక్ క్లోజ్ నెస్ ఉందని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
అదేంటో కానీ రానాపై నిత్యం ఏదోక హీరోయిన్‌తో లింక్ పెడుతూ వార్తలు వస్తుంటాయి. గతంలో త్రిష, బిపాస బసు, శ్రియ లాంటి హీరోయిన్స్ రానాతో లవ్ ఎఫైర్ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వరుసలో రకుల్ ప్రీత్ సింగ్ చేరిపోయింది. మరి ఈ ప్రేమాయణం ఎంత కాలమో వేచి చూడాలి.