మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (19:24 IST)

తెలంగాణలో బోర్డు పెట్టేశారు, ఈ 6 గుండుమాత్రలతో కరోనా పరార్, నిజమా?

కరోనా వైరస్
కరోనా వైరెస్ వ్యాధికి మందు ఇప్పటి వరకూ కనుగొనలేదు. వేలల్లో జనం ప్రాణాలు పోయిన చైనా కరోనాను అడ్డుకునేందుకు ఔషధాన్ని కనుగొనేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలావుండగానే ప్రపంచంలో 66 దేశాలకు కరోనా వైరెస్ వ్యాపించింది. ఈ దేశాల్లో ఇండియా కూడా చేరిపోయింది. తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకటి తెలంగాణ రాజధాని హైదరాబాదులో అయితే మరొకటి ఢిల్లీలో.
వ్యాధి నిర్థారణ అయిన రోగులను ఐసోలేటెడ్ గదుల్లో వుంచి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వ్యాధిని ఎలా అడ్డుకోవాలో చెపుతూ టీవీల ద్వారా, హోర్డింగుల ద్వారా ప్రజలకు తెలియజేస్తోంది. ఐతే తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ పోస్టు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 
ఆ ప్రకనట సారాంశాం ఏంటంటే... కరోనా వైరెస్‌ను ఆయుర్వేదం అడ్డుకుంటుందట. ఎలాగంటే, మూడు రోజుల పాటు ప్రతిరోజూ 6 గుండుమాత్రలు వేసుకోవాలి. ఇది పెద్దవాళ్లకు. 0-1, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలతో కలిపి 3 మాత్రలివ్వాలి. ఏడాది పైన వున్న పిల్లలకి 6 మాత్రలు వేయాలి. అది కూడా అన్నం తినే అర్థగంట ముందు. ఇదంతా చూసిన జనం, ఇది నిజమేనా అని చర్చించుకుంటున్నారు.