మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (19:16 IST)

ఆల్కహాల్‌తో కరోనా వైరస్ విరుగుడు? నిజమా? (video)

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ తీవ్రత రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. వేలాది మంది ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
అలాగే, హైదరాబాద్‌, ఢిల్లీల్లో కరోనా బాధితులను గుర్తించి వారికి చికిత్సనందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ బారిన పడకుండా చూసుకోవడం ఆవశ్యకమైంది. అయితే కరోనా వైరస్‌ రాకుండా చూసేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా చేతులను ఎప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాల్‌ కలిగిన హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలని చెబుతున్నారు. అయితే ఆల్కహాల్‌ నిజంగానే కరోనా వైరస్‌ను నాశనం చేస్తుందా..? అనే అంశంపై వైద్యులు ఇలా వివరణ ఇస్తున్నారు. 
 
ఆల్కహాల్‌తో చేతులను శుభ్రం చేసుకున్నా, దాన్ని లోపలికి తీసుకున్నా.. ఆ వైరస్‌ నాశనం కాదుకానీ, అది ఇతరులకు రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. అదేసమయంలో కరోనా వైరస్‌ రాని వారు చేతులను ఆల్కహాల్‌ కలిగిన హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే ఆ వైరస్‌ నాశనమవుతుందని తెలిపారు. అంతేకానీ, ఆల్కహాల్‌తో కరోనా వైరస్ నాశనం కాదని వారు వివరణ ఇచ్చారు.