1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Charmi Kaur controversy comments on Corona Virus in Telugu states

కరోనా వైరస్ వచ్చిందట... హ, హ్హ, హ్హ్హ, ఛార్మికి ఏమైంది?

Charmi Kaur
ఛార్మి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పూరి డైరెక్షన్లో ఫైటర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రం ప్రస్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే... ఎప్పటికప్పుడు ఈ మూవీ అప్‌డేట్స్‌తో తనకు నచ్చిన వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఛార్మి తాజాగా కరోనా వైరస్ గురించి టీక్ టాక్ చేసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది.
కరోనా వైరస్ గురించి పిచ్చి పిచ్చిగా ఫన్నీగా వీడియో చేసింది. ఇంతకీ ఏమని టిక్ టాక్ చేసిందంటే... ఢిల్లీకి, తెలంగాణకి కరోనా వైరస్ చేరిందిట. హ.. హ.. హా.. వార్తల్లో చదివాను. మరి ఆల్ ది బెస్ట్ మీకు... హా.. హహ్హ.. ఇలా పిచ్చి పిచ్చిగా ఒక టిక్ టాక్ వీడియో చేసి షేర్ చేసింది. ఆ వీడియో చూసిన వెంటనే జనాలకి ఓ రేంజ్‌లో  కోపం వచ్చింది.

 
అంతే.. ఈ అమ్మడుని ఓ రేంజ్‌లో  పచ్చి పచ్చిగా తిట్టారు. దాంతో దెబ్బకి వీడియోని డిలీట్ చేసింది.  ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి గురించి ఇలా ఫన్‌గా వీడియో చేయడంతో జనాలు సైలెంట్‌గా ఉండలేక పోయారు.
కరోనా వైరెస్

ముంబాయిలో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ గురించి ఆలోచించకుండా ఇలా పిచ్చిపిచ్చిగా వీడియోలు చేయడం ఏంటో..? ఇకనైనా ఈ అమ్మడు కాస్త జాగ్రత్తగా వీడియోలు పెడితే బెటర్. లేకపోతే.. నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకోవడం ఖాయం.

తర్వాతి కథనం
పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ కారుకు తుపాకీ ఎక్కుపెట్టిన సెక్యూరిటీ.. ఎందుకు?