శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (15:13 IST)

దేశవాళీ క్రికెట్‌లో ఇంటర్నేషనల్ హెల్మెట్ వేసుకున్నాడు..

వెన్ను గాయం నుంచి కోలుకుని ఇటీవలే గ్రౌండ్‌లోకి వెళ్లాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడాడు. 
 
ఈ మ్యాచ్‌లో తన సహజసిద్ధమైన ఆటతో ప్రేక్షకులను అలరించాడు. 25 బంతుల్లోనే 38 పరుగులు రాబట్టడమే కాకుండా.. మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో దాదాపుగా సఫారీలతో సిరీస్‌కు రీ-ఎంట్రీ ఖరారు అయినట్లే. 
 
కానీ అవగాహన లేక ఈ మ్యాచ్‌ ద్వారా ఊహించని విధంగా చిక్కుల్లో పడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇంటర్నేషనల్ హెల్మెట్ వాడాడు. బీసీసీఐ నిబంధనలకు ఇది విరుద్ధం. మరి దీనిపై బీసీసీఐ ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.