మొతేరా స్టేడియాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు..

Motera
ఠాగూర్| Last Updated: బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (16:50 IST)
ప్రపంచంలో ఉన్న అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో మొదటి స్థానంలో మెల్బ్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ఒకటి. క్రికెట్ మైదానాల గురించి ఎవరు మాట్లాడినా ఎంసీజీ స్టేడియం గురించే చెబుతుంటారు. ఇపుడు ఈ స్టేడియాన్ని తలదన్నేలా మరో స్టేడియం వచ్చింది. అది ఎక్కడో విదేశాల్లో కాదు.. మన దేశంలోనే. ఆ స్టేడియం పేరు మొతేరా స్టేడియం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో నిర్మితమైంది. ఈ స్టేడియం ఎంసీజీని మించిపోయింది. ప్రపంచంలోనే అతి భారీ క్రికెట్ స్టేడియంగా ఇకపై ఇది నిలవనుంది.

ఎంసీజీ సామర్థ్యం 90 వేలు కాగా, మొతేరా స్టేడియం కెపాసిటీ ఒక లక్ష 10 వేల సీట్ల పైమాటే! అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకున్న ఈ క్రికెట్ స్టేడియాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంలోనే ట్రంప్ 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారు. మొతేరా స్టేడియంలో అత్యాధునిక సీటింగ్ సౌకర్యాలు, పకడ్బందీ డ్రైనేజీ ఏర్పాట్లు ఉన్నాయి.

ఇందులో 70 కార్పొరేట్ బాక్స్‌లు ఉండగా.. నాలుగు డ్రెస్సింగ్ రూములు, 50 గదులతో క్లబ్ హౌస్,
పెద్ద స్విమ్మింగ్ పూల్‌‌ కూడా ఏర్పాటు చేశారు. దీనిలో ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. స్టేడియంలో మూడువేల కార్లు, పదివేల మోటార్ సైకిళ్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. భార‌త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేడియాన్నికి రానున్నారు. అందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మోటెరా స్టేడియాన్ని సందర్శించారు.దీనిపై మరింత చదవండి :