ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:02 IST)

కివీస్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్‌ వుండడట.. ఫ్యాన్స్‌కు షాక్

కివీస్ పర్యటనలో టీమిండియా జట్టు అదరగొడుతోంది. టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై సత్తా చాటింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. 
 
అయితే ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ ఆడట్లేదనే షాకింగ్ నిజాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం వుందని ఇప్పటికే క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్వంటీ-20 సిరీస్‌లో గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.