మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (18:58 IST)

ఏంటయ్యా? విలియమ్సన్.. బాల్ సౌథీకి ఇచ్చేటప్పుడు గమనించవా?: ధోనీ (Video)

భారత్-న్యూజిలాండ్‌ల మధ్య మూడో టీ-20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగిసిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్‌తో టీమిండియా ఓ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

టీమిండియా గెలుపు గురించి స్పందించాడు. ఇంకా టీమిండియా గెలుపుకు కారణమైన విషయాన్ని ధోనీ చెప్పాడు. మ్యాచ్‌కు చివర్లో చేసిన తప్పిదంతోనే ఉత్కంఠభరితంగా జరిగిన హామిల్టన్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిందని తెలిపాడు. 
 
సూపర్ ఓవర్‌కు బౌలింగ్ చేసేటప్పుడు ఓ బౌలర్ రికార్డులను కెప్టెన్ చెక్ చేసి వుండాలన్నాడు. అదీకాకపోతే.. ఈ సిరీస్‌లోనైనా సూపర్ ఓవర్‌కు బంతులేసే బౌలర్ల వికెట్ల సంఖ్యను తెలుసుకుని వుండాలి. ఈ విషయాన్ని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొంచెం కూడా పట్టించుకోలేదని ధోనీ అన్నాడు. ఈ విషయం సూపర్ ఓవర్‌‍కు సౌథీని ఎంపిక చేసినప్పుడే ఆ విషయం స్పష్టంగా అర్థమైపోయిందని ధోనీ వ్యాఖ్యానించాడు. 
 
ఎందుకంటే..? సౌథీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఐదు సూపర్ ఓవర్లకు బంతులేసినా.. ఒక్క మ్యాచ్‌ విజయాన్ని మాత్రమే కివీస్ ఖాతాలో చేర్చాడు. ఈ విషయాన్ని కేన్ విలియమ్సన్ గమనించలేదన్నాడు. కివీస్ కెప్టెన్ చేసిన తప్పిదాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకుని గెలుపును నమోదు చేసుకుందని, ముఖ్యంగా రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ధోనీ కితాబిచ్చాడు. కాగా ఇప్పటివరకు ఏడు సూపర్ ఓవర్లు ఆడిన కివీస్.. ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. 
 
కాగా.. భారత్‌పై అలవోకగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది కివీస్. అయితే తమ ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించకపోవడమేనని మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో తాము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నాడు. సూపర్ ఓవర్ అనేది కూడా తమకు కలిసి రావడం లేదని తెలిపాడు.