జార్ఖండ్ డైనమెట్ రికార్డును బద్ధలుకొట్టిన విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ వ్యక్తిగతంగా 25 పరుగులు చేయడం ద్వారా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
కాగా, హామిల్టన్ టీ20లో కోహ్లీ 38 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత్ తరపున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోనీ (1112 ) పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును కోహ్లీ(1126) తన పేరిట లిఖించుకున్నాడు.
ఓవరాల్‌గా టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక రన్స్ చేసిన జాబితాలో సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(1,273), న్యూజిలాండ్ సారథి కేన్ విలయమ్సన్(1148, భారత్‌తో మూడో టీ20 ముందు వరకు) ఉన్నారు. దీంతో ఓవరాల్ జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
మరోవైపు, ఈ ట్వంటీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. సూపర్ ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ సిరీస్‌ను తన వశం చేసుకుంది.