ఆవనూనె, పామాయిల్‌తో దీపమెలిగించారో.. ఇక అంతే సంగతులు?! (video)
రోజూ మనం వెలిగించాల్సిన దీపాల కోసం మనం వినియోగించే నూనెల గురించి తెలుసుకుందాం.. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట దీపారాధన చేయడం మంచిది. దీపారాధన మహిళలే చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.
సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించి పూజ చేయాలి. దీపానికి నెయ్యి, వేపనూనె, కొబ్బరి నూనె, ఆముదం వంటి వాటిని కలిపి వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
నేతితో దీపం వెలిగించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గృహంలోని ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. దోషాలుండవు.
ఆముదంతో దీపం వెలిగిస్తే.. కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. సిరిసంపదలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య కలహాలుండవు. అన్యోన్యత పెంపొందుతుంది.
ఇంటి దేవత అనుగ్రహం పొందాలనుకునేవారు ఆముదంతో దీపాలను వెలిగించాలి. వంశవృద్ధికి ఆముదంతో ఇంట దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
అయితే ఆవనూనె, పామాయిల్, వేరుశెనగల నూనెను దీపారాధానకు ఉపయోగించకూడదు. ఇంట్లోనే కాకుండా ఆలయాల్లో ఈ నూనెను దీపారాధనకు వాడకూడదు. ఈ నూనెలతో దీపమెలిగిస్తే ఇబ్బందులు, ఈతిబాధలు, పాపాలు, దోషాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.