రుచికరమైన పండ్లను దానం చేస్తే..? కన్యను సత్ర్పవర్తనతో పెంచి..? (Video)
దానాలను చేయడం ద్వారా విశిష్ట ఫలితాలను పొందవచ్చు. అలాంటి దానాల్లో విశిష్ఠమైనవో గరుడ పురాణంలో చెప్పబడిన కొన్నింటిని గురించి తెలుసుకుందాం.. కన్యను అంటే ఓ యువతిని సత్ర్పవర్తనతో పెంచి.. వివాహం జరిపించినట్లైతే.. ఆ దంపతులు 14 ఇంద్ర దేవుని ఆయుర్ కాలం వరకు దేవతల రాజధాని అయిన అమరావతిలో సుఖభోగాలు అనుభవిస్తారు.
అలాగే 16 స్వర్ణ, రజత ఆభరణాలను దానం చేసిన వారు.. కుబేర లోకంలో నివసిస్తారని విశ్వాసం. ఇతరులకు అంటే పేదలకు ధనాన్ని సాయంగా అందజేస్తే.. శ్వేత దీపంలో జీవిస్తారని ఆధ్యాత్మిక పండితుల అంటున్నారు.
నీటి వనరులను సంరక్షించే వారు.. ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఇంకా ప్రయోజిత వృక్షాలను పరిరక్షించే వారు.. తపోలోకానికి చేరుతారు. వ్రతాలు, నోములు భక్తి శ్రద్ధలతో ఆచరించే వారు 14 ఇంద్ర ఆయుర్ కాలం వరకు స్వర్గంలో నివసిస్తారు. సుదర్శన హోమం, ధన్వంతరి హోమం చేసే వారు ఆయురారోగ్యాలతో శత్రుబాధలంటూ లేకుండా జీవిస్తారు.
ఒక చెంబు నీటిని అంటే తాగునీటిని దానం చేస్తే కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది. అరుణోదయ సమయంలో గంగాస్నానం చేసేవారికి 60000 సంవత్సరాల పాటు పరమపదం చేకూరుతుంది. రుచికరమైన పండ్లను దానం చేస్తే.. ఒక పండుకు ఒక సంవత్సరం కాలం పాటు గంధర్వ లోకంలో నివసిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
ఆలయాల్లోని మాడ వీధులను పరిరక్షించేవారికి 10000 సంవత్సరాలు ఇంద్రలోక ప్రాప్తి చేకూరుతుంది. పౌర్ణమిలో డోలోత్సవం నిర్వహించే వారికి సకల భోగభాగ్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.