సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (21:34 IST)

ఇక మనం కలుస్తామో లేదో? ప్రియురాలితో కొత్త పెళ్లికొడుకు, ఆ తర్వాత?

పెళ్ళయి మూడురోజులే అయ్యింది. తన పెళ్ళికి వచ్చిన బంధువుల అమ్మాయిని పెళ్ళి కొడుకు లైన్లో పెట్టాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్ళి తరువాత భార్యతో మూడురోజుల పాటు గడపాల్సిన శోభనాన్ని మరో యువతితోనే అదే పని చేసి అడ్డంగా దొరికిపోయాడు.
 
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌కు మూడురోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్ళయ్యింది. పెళ్ళికి వచ్చిన కర్నూలుకు చెందిన బంధువుల అమ్మాయితో అంతకుముందే సాయిప్రసాద్‌కు పరిచయం ఉండేది.
 
అయితే పెళ్ళయిన వెంటనే ఆమెతో మాటలు కలిపాడు. ఇక మనం కలుస్తామో లేదో నా కోర్కె తీర్చు అంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డాడు. దీనితో యువతి మెత్తబడటంతో అదే అదనుగా ఆమెతో శారీరక సంబంధం పెట్టేసుకున్నాడు. ఇలా మూడురోజుల పాటు గడిపాడు. కొత్త పెళ్ళికొడుకు ఇంట్లో ఉండకుండా ఉదయం అయితే బయటకు వెళ్ళిపోవడం.. బాగా పొద్దుపోయాక ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
 
యువతిని, పెళ్ళికొడుకుని ఫాలో అయ్యారు. దీంతో వారి బండారం బయటపడింది. పెళ్ళికొడుక్కి దేహశుద్ధి చేశారు బంధువులు. పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు.