శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (22:01 IST)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్.. రుత్ రాజ్‌కు కరోనా వైరస్? (video)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుసగా షాకవుతోంది. తాజాగా మరో ఆటగాడికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం చేసిన ఆర్‌టీ‌పీసీఆర్‌ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా ధ్రువీకరణ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఫ్రాంచైజీలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య మొత్తంగా 13కు చేరింది. ఒకే బృందంలో అంతమందికి వైరస్‌ సోకిందంటే పరిస్థితి కష్టమేనని అనిపిస్తోంది.
 
ప్రస్తుతం వైరస్‌ సోకిన ఆటగాడు టాప్‌ ఆర్డర్‌లో ఆడతాడని తెలిసింది. ఈ మధ్యే భారత్‌-ఏకు ఎంపికయ్యాడని, టాప్‌ ఆర్డర్‌లో ఆడతాడని, రంజీల్లో పరుగుల వరద పారించాడని సమాచారం. దాంతో మహారాష్ట్ర యువ క్రికెటర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్ పైనే అనుమానాలు నెలకొన్నాయి. 2018-19 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రుతురాజ్‌ పరుగుల వరద పారించాడు. మహారాష్ట్ర తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అందుకే 2019 వేలంలో అతడిని చెన్నై కొనుగోలు చేసింది.
 
ఇప్పటికే సురేశ్‌ రైనా పూర్తిగా టోర్నీకి దూరమయ్యాడు. జట్టులో చాలామంది కోవిడ్‌ రావడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతోనే అతడు తిరిగి భారత్‌కు పయనమవుతున్నాడని అంటున్నారు. 13 మందికి వైరస్‌ సోకడంతో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా? ఆడేందుకు మొగ్గు చూపుతారా? అనేది అనుమానంగా మారింది.