శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:44 IST)

బర్త్‌డే పార్టీలో రచ్చరచ్చ : కరోనా బారినపడిన ఉస్సేన్ బోల్ట్

జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ కరోనా వైరస్ బారినపడ్డాడు. గత శుక్రవారం తన 34వ జన్మదినాన్ని పురస్కరించుకుని బోల్ట్‌ భారీ పార్టీ ఇచ్చాడు. దీనికి వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌‍గేల్‌, ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ రహీమ్‌ స్టెర్లింగ్‌ తదితరులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా బోల్ట్‌కు పాజిటివ్‌గా వచ్చినట్టు జమైకాకు చెందిన ఓ రేడియో చానెల్‌ తెలిపింది. 
 
తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ట్విట్టర్‌లో ఉసేన్‌ వీడియోను పోస్టు చేశాడు. 'శనివారం పరీక్షలు చేయించుకున్నా. కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. నాకు ఎటువంటి వ్యాధి లక్షణాలూ లేవు. స్వీయ నిర్బంధంలో ఉన్నాన' అని బోల్ట్ పేర్కొన్నాడు. తన పుట్టిన రోజు పార్టీలో భౌతిక దూరం పాటించకుండా అతిథులతో కలసి బోల్డ్‌ హంగామా చేసిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే.
 
కర్నాటక చీఫ్ డీకేకు పాజిటివ్ 
మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
 
కాగా, డీకే శివకుమార్ ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కర్ణాటక రాజకీయ ప్రముఖుల్లో అనేకమంది కరోనా బాధితులైన విషయం తెల్సిందే. సీఎం యడియూరప్ప సహా మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆయన తనయుడు కూడా కరోనా ప్రభావానికి గురయ్యారు. వారే కాదు కొందరు మంత్రులు, శాసనసభ్యులకు సైతం పాజిటివ్ వచ్చింది.