తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ళకు - ఉత్పల్ పారికర్‌కు కరోనా పాజిటివ్

coronavirus
ఠాగూర్| Last Updated: ఆదివారం, 16 ఆగస్టు 2020 (17:26 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన వేగుళ్ళ జోగేశ్వర రావుకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఆయన హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగేశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలకు కరోనా సోకింది.

ఇప్పటికే రాష్ట్రానికి చెందిన విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు.

ఇదిలావుంటే, బీజేపీ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ కరోనా బారినపడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఉత్పల్‌ తెలిపారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

మైల్డ్‌ ఇన్ఫెక్షన్‌ కాబట్టి నేను హోం క్వారంటైన్‌లో ఉంటానని శనివారం సాయంత్రం చెప్పారు. 'వైద్యుల సలహా మేరకు, సరైన చికిత్స తీసుకోవడానికి నేను ఆస్పత్రిలో చేరాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఉత్పల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.దీనిపై మరింత చదవండి :