తమిళనాడు గవర్నర్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్

purohit
ఠాగూర్| Last Updated: ఆదివారం, 2 ఆగస్టు 2020 (17:57 IST)
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ కరోనా వైరస్ బారిపడ్డారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో గవర్నర్ భన్వరిలాల్ జూలై 29 నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
purohit

ఇటీవలే తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది. గవర్నర్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గవర్నర్ భన్వరిలాల్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్‌లో ఉంచి కావేరీ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించనుంది.దీనిపై మరింత చదవండి :