గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:29 IST)

బయో బబుల్స్ ఐడియా ఇచ్చింది ధోనీనే.. సీఎస్కే సీఈవో

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమని  సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. తనకు ఈ క్యాంప్ నిర్వహణపై కొన్ని అనుమానాలుండటంతో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేదని ఆయన చెప్పారు. అయితే ధోనీ మాత్రం క్యాంప్ నిర్వహించాలని సూచించాడని చెప్పారు. 
 
ధోనీ చాలా స్పష్టంగా అభిప్రాయం చెప్పడంతో తన అనుమానాలు పటాపంచలైపోయాయని తెలిపారు. 'సర్.. మేము గత నాలుగైదు నెలలుగా క్రికెట్ ఆడలేదు. అలాగే దుబాయి వెళ్లాక బయో బబుల్స్‌లో ఉండాలి. అది ఆటగాళ్లకు చాలా కొత్త అనుభవం.
Bio Bubble


అదే చెన్నైలోనే ఈ అనుభవాన్ని అలవాటు చేస్తే, దుబాయి వెళ్లాక ఎటువంటి ఇబ్బందులూ ఉండవని ధోనీ మెసేజ్ చేశాడట. దీంతోనే చెన్నైలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించినట్లు విశ్వనాథన్ పేర్కొన్నారు.