సంబంధిత వార్తలు
- బాలు పేరుతో సంగీత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలి : చంద్రబాబు విజ్ఞప్తి
- రైతుల గుండెల్లో బీజేపి రెండు బాంబులు: మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం
- 16 నెలల్లో రూ.1.26 లక్షల కోట్లు అప్పులతో జగన్ రికార్డ్: యనమల రామకృష్ణుడు
- ఆ అవసరం వచ్చినప్పుడల్లా సుశాంత్ నన్ను వాడుకున్నాడు: రియా చక్రవర్తి సన్సేషన్
- అత్తారింటికి దారేది దొరికింది, నేడు అమరావతి దారేది అంటూ పవన్ వస్తున్నారు: ఆర్ఆర్ఆర్
వాళ్ళని రెచ్చగొట్టడమే చంద్రబాబు పని, రోజా ఫైర్.?
రోజా మరోసారి ఫైరయ్యారు. ప్రతిపక్షనేత నారాచంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అంటే ఒక విలువ ఉండాలి. కానీ ప్రస్తుత ప్రతిపక్షనేత మాత్రం ఏం చేస్తారో అర్థం కాదు. ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదు.
రాష్ట్రప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై స్పందించాల్సిన చంద్రబాబు వాటిలో లేనిపోని లొసుగులను వెతుక్కుంటూ కావాలనే ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. చేనేత, పవర్ లూమ్స్ కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని.. అయితే కావాలనే చంద్రబాబు కార్మికులను రెచ్చగొట్టి తన ఇంటి ముట్టడికి కారణమయ్యారన్నారు.
పవర్ లూమ్స్ కార్మికులతో కలిసి కొంతమంది ప్రజా సంఘాలు తన ఇంటిని ముట్టడించాయని.. తాను ఇంట్లో లేనని పిఎ చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసునని.. అంతకుమించి తాను మాట్లాడనంటూ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు రోజా.
చంద్రబాబునాయుడులో ఇప్పటికైనా మార్పు కోరుకుంటున్నానని.. మార్పు వస్తే బాగుంటుందన్నారు. కరోనా సమయంలో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నామని.. అలాగే చేనేత కార్మికులకు పథకాలన్నీ అందేవిధంగా చూశామన్నారు రోజా.
