కరోనాకు తర్వాత పాకిస్థాన్‌లో విద్యా సంస్థలన్నీ ఓపెన్
పాకిస్థాన్‌లో ఆరు నెలల విద్యా సంస్థలన్నీ గురువారం తెరుచుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండూ బుధవారం తెరుచుకున్నాయి. కాగా కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా విద్యాసంస్థలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఫెడరల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ షఫ్కత్ మహమూద్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో గరిష్ట సంఖ్యలో విద్యార్థులు చేరారన్నారు.
విద్యాసంస్థలు మూసివేయడం వల్ల వారు ఎక్కువగా నష్టపోయారని తెలిపారు. కరోనా వైరస్ పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం మాత్రమే అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో 1,71,436 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా వీటిలో 1 శాతం సంక్రమణ మాత్రమే కనుగొనబడినట్లు తెలిపారు.
ఈ డేటాను దృష్టిలో ఉంచుకుని ప్రాథమికస్థాయి తరగతులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మహ్మద్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 3,12,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్-19తో 6,479 మంది చనిపోయారు. 467 కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. 2,96,881 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.