1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Another 2,239 new coronavirus cases registered in Telangana

తెలంగాణలో కరోనావైరస్ కలకలం, కొత్తగా 2,239 పాజిటివ్ కేసులు

new coronavirus cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 58,925 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,239 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,091కి చేరింది.
 
నిన్న 2,181మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,52,441గా వుంది.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 30,334యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,683మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 28,00,761కి చేరింది.
About Writer
వి
తర్వాతి కథనం
కీసర తాహసీల్దార్ లీలలు ఎన్నో.. ఎన్నెన్నో... రూ.2 కోట్ల నగదు లంచం డిమాండ్!!