శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (21:22 IST)

మందు బాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, క్లబ్బులకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పర్మిట్ రూమ్‌లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అలాగే బార్లు, క్లబ్‌లలో మ్యూజికల్ ఈవెంట్స్, డాన్స్‌లకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం పేర్కొంది.
 
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ఆర్డర్ కాపీలో ప్రభుత్వం పేర్కొంది. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నది. దీంతో ఆరు నెలలు తర్వాత రాష్ట్రంలో మళ్లీ బార్లు, క్లబ్‌లు  ఓపెన్ కానున్నాయి. ఇక కరోనాను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి బార్లు కూడా మూతపడ్డాయి.
 
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కోదానికి అనుమతి ఇస్తూ వస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలు రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోగా ఈ రోజు నుంచి హైదరాబాదు సిటీ బస్సులు కూడా మొదలయ్యాయి. ఇక తాజాగా బార్లు, క్లబ్‌లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.