సంబంధిత వార్తలు
- గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
- ఆపిల్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు...?
- ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సమరం : సీఎం జగన్ ప్రభుత్వం సహకరించేనా?
- విభజించు - పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న పాలకులు : పవన్ కళ్యాణ్
- నేను మెసయ్యను కాదంటున్న సోనూ సూద్ : పంజాబ్ ఐకాన్‌గా... (video)
ఏపీ కరోనా బులెటిన్, కొత్తగా 1,375 పాజిటివ్ కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో తన ప్రభావాన్ని విస్తరిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఏపీలో తగ్గుతూ వచ్చిన కరోనా మహమ్మారి మళ్లీ తన తీవ్రతను పెంచింది. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి.
గత 24 గంటల్లో 1,375 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 260 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 18 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.
ఇదిలా ఉండగా 2,293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 8,56,159కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా కరోనా బారిన పడి మొత్తం 6,890 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
