1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Bill Gates tests positive for Covid, says he is experiencing mild symptoms

బిల్ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో వున్నానని ప్రకటన

Bill Gates
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. తేలికపాటి లక్షణాలతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో వున్నట్లు స్వయంగా ధ్రువీకరించారు. 
 
తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకునేంతవరకు ఐసోలేట్ అవుతానని బిల్ గేట్స్ చెప్పారు. కరోనా పరిస్థితుల్లో టీకాలు వేయించడం, బూస్టర్ డోసులు, కోవిడ్ టెస్టులు చేయించుకునే వెసులుబాటుతో పాటు మంచి వైద్యులు అందుబాటులో ఉండటం తన అదృష్టమని గేట్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
 
ఇకపోతే.. బిల్ గేట్స్ కరోనా నిర్మూలనలో ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్‌లు, మందులు అందేలా ఎంతో కృషి చేశారు. అక్టోబరులో గేట్స్ ఫౌండేషన్ తక్కువ-ఆదాయ దేశాల కోసం.. డ్రగ్‌మేకర్ మెర్క్ యాంటీవైరల్ కోవిడ్ పిల్ జెనరిక్ వెర్షన్‌లకు యాక్సెస్‌ను పెంచడానికి 120 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది.
 
గతంలో బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా ఫార్ములాను పంచుకోవద్దని సూచించారు. భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలనుద్దేశించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ, పేటెంట్లకు సంబంధించి బిల్ గేట్స్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
విశ్రాంతి తీసుకున్న డ్యూటీ డాక్టర్ .. రోగికి చికిత్స చేసిన స్వీపర్లు