1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (10:31 IST)

దేశంలో కొత్తగా 3451 కరోనా పాజిటివ్ కేసులు

covid test
దేశంలో కొత్తగా మరో 3451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఈ మొత్తం కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో కరోనా వైరస్ సోకిన వారిలో 40 మంది చనిపోయినట్టు తెలిపింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో 20635 మంది చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా కరోనా నుంచి గత 24 గంటల్లో 3079 మంది కోలుకున్నట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,495గా వుంది. అలాగే, మృతుల సంఖ్య 5,24,064గా ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది.