సంబంధిత వార్తలు
- లక్షకు చేరిన కరోనా వైరస్ సంక్రమణ కేసులు.. భారత్‌లో 31
- కరోనా వైరస్.. చైనాలో తగ్గుతుంటే.. భారత్‌లో పెరుగుతున్నాయ్... (Video)
- కరోనాపై వర్మ కామెంట్.. కరోనా వైరస్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదన్న నెటిజన్
- కరోనా వైరస్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి.... ఎక్కడ?
- చైనాలో మరో 42 మంది మృతి. 3 వేలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య...
చైనా నుంచి ఫిష్ షిప్, సముద్రంలోనే నిలిపేశారు
చైనా నుంచి ఏమి వస్తున్నా బాబోయ్ అంటున్నారు జనం. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలా చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఐతే అవి ఎప్పుడు వచ్చాయన్నది చూసుకుని మరీ కొంటున్నారు ప్రజలు. ఇక అసలు విషయానికి వస్తే... చైనా నుంచి తాజాగా ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా ఫిష్ షిప్ శుక్రవారం విశాఖ పోర్టుకు వచ్చింది.
ఇందులో 22 మంది షిప్ సిబ్బందిలో 17 మంది చైనా, ఐదుగురు మియన్మార్‌కు చెందినవారు కావడంతో ఆ షిప్ సమాచారం రాగానే దాన్ని సముద్రంలోనే దూరంగా ఆపేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో వచ్చినవారిలో ఎవరికైనా కోవిడ్-19 వైరస్ వున్నదో లేదో చెక్ చేస్తున్నారు.
షిప్‌ను సముద్రంలో ఆపివేయడానికి కారణం ఇదేనంటూ పోర్టు అధికారులు చెప్పారు. ఐతే చైనా నుంచి వచ్చిందని తెలియగానే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
