గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (17:46 IST)

కరోనాపై వర్మ కామెంట్.. కరోనా వైరస్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదన్న నెటిజన్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా ఈసారి వైరస్‌ను టార్గెట్ చేశారు. ''డియర్ కరోనా వైరస్... మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్లేబదులు ఒక విషయం గురించి తెలుసుకో. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్. నీవు నా మాటలను నమ్మకపోతే... వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో. నీకు నా విన్నపం ఏమిటంటే... బతుకు, బతికించు. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశారు.
 
అయితే వర్మ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందించాడు. కరోనా వైరస్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదని.. చైనా వెళ్లి.. ఆ వైరస్‌ను ఎక్కించుకుంటే.. అది వర్మ మాట వింటుందని రీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దని వైద్యులు సూచిస్తోన్న నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు పంక్షన్‌లను వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని చింతల్‌లో దంపతులు గోపాల్ రెడ్డి, భారతి తమ 25వ పెళ్లిరోజు వేడుకను జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.