1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Pawan Kalyan likely to romance Pooja Hegde

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

pooja hegde
చిత్రపరిశ్రమలో బుట్టబొమ్మగా పేరొందిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా ఏమాత్రం కలిసిరావడం లేదు. ఒకపుడు వరుస అవకాశాలతో అగ్ర హీరోయిన్‌గా రాణించిన ఈ భామకు ఇపుడు సినీ అవకాశాలు లేకపోవడంతో వెనుకబడిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న 'ఓజీ-2' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 
 
దర్శకుడు సుజిత్, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తొలి భాగం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో ఇపుడు రెండో భాగానికి శ్రీకారం చుట్టి నటీనటుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా, హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే పూజ హెగ్డే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. 
 
గతంలో పవన్ సరసన పూజా హెగ్డే నటించాల్సింది. కానీ, డేట్స్ సమస్య కారణంగా వచ్చిన అవకాశాన్ని ఆమె వదులుకున్నారు. హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ జాగర్లమూడి చిత్రాల్లో ఆమె పేరు వినిపించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇపుడు 'ఓజీ-2'కు ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై వాస్తవమెంతో తెలియాలంటే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సివుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్