నేను దేవుడు దగ్గరకి వెళ్లిపోతా, మూడో అంతస్తు నుంచి దూకేసిన కరోనా రోగి

corona deaths
corona deaths
సెల్వి| Last Updated: శనివారం, 29 ఆగస్టు 2020 (19:33 IST)
కోవిడ్ ఆస్పత్రి నుంచి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు (32) ఈ నెల 17న ఆశ్రం కోవిడ్‌ ఆసుపత్రిలో చేరాడు. గత మూడు రోజులుగా రాంబాబు 'నేను దేవుడు దగ్గరకి వెళిపోతా' అంటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో రాంబాబును చూసుకునేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

రాంబాబు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున 'బై బై.. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా' అని గట్టిగా అరుస్తూ మూడో అంతస్తు కిటికీలో నుంచి కిందకు దూకాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ సీఐ అనసూరి.శ్రీనివాస్, ఎస్సై చావా సురేష్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :