సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (08:32 IST)

కరోనాపై షాకింగ్ న్యూస్.. ఆరు అడుగులు కాదు.. 26 అడుగులు కావాలి

కరోనాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి భౌతిక దూరం పాటించాలని.. ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని ఇన్నిరోజులూ అనుకున్నాం. కానీ… కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. 
 
కోవిడ్‌-19 బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే తుంపర్లు కొద్ది సెకన్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని ఆ సర్వే వెల్లడించింది. అయితే.. వైరస్‌ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటినుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు మాత్రం ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ పరిశోధన తేల్చింది. 
 
ఈ నేపథ్యంలో కొవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.