ప్రజలు కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

corona virus
వి| Last Modified శనివారం, 29 ఆగస్టు 2020 (16:26 IST)
ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల్లో భారతదేశం అగ్ర స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏకంగా 75 వేలకు పైగా కేసులు
నమోదవుతున్నాయి. అయితే రికవరీల రేటు అధికంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.

దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. రికవరీల సంఖ్య ఎక్కవగా ఉన్నప్పటికీ కరోనాను తేలికగా తీసుకోవద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలను కోరారు. మధ్యప్రదేశ్‌లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

భారత్‌లో రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని చెప్పారు. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.82 శాతంగా ఉందని వివరించారు. దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి స్థానిక నాయకులందరూ అవగాహన కల్పించాలని ఆయన కోరారు.దీనిపై మరింత చదవండి :