1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus Spreading in Andhra Pradesh

ఆంధ్రాలో కరోనా మరణాలు 51 - పాజిటివ్ కేసులు 6235

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. అటు పాజిటివ్ కేసులతో పాటు.. ఈ వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 51 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 6235 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇందులో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,749కి పెరిగింది. మరణాల సంఖ్య 5,410కి చేరింది. తాజాగా 10,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 2,996, చిత్తూరు 6,906, ఈస్ట్ గోదావరి 12,134, గుంటూరు 6,418, కడప 3,569, కృష్ణ 2,849, కర్నూలు 2,868, నెల్లూరు 2,757, ప్రకాశం 10,935. శ్రీకాకుళం 5,205, విశాఖపట్టణం 4,206, విజయనగరం 6,876, వెస్ట్ గోదావరి 6,899 చొప్పున మొత్తం 7,4518 కేసులు ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
డ్రగ్స్ చిక్కుల్లో ఫేమస్ డాన్స్ మాస్టర్