గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:17 IST)

కొడుకుతో కలిసి ప్లాస్మాదానం డొనేట్ చేసిన సంగీత దర్శకుడు కీరవాణి

టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. సోమవారం తన కుమారుడు కాలభైరవతో కలిసి కోవిడ్ బాధితుల కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వీళ్లిద్దరూ గతంలోనూ ప్లాస్మా ఇచ్చి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
శరీరంలో యాంటీబాడీస్ ఇంకా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్లాస్మా ఇస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. త్వరలో RRR మ్యూజిక్ ప్రారంభిస్తామని కీరవాణి వెల్లడించారు. అంతకుముందు వీళ్లిద్దరూ కిమ్స్ హాస్పిటల్లో మొదటిసారి ప్లాస్మాను దానం చేసినట్లు తెలిపారు.
 
అటు రాజమౌళి కూడా త్వరలో ప్లాస్మా డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం రాజమౌళి, కీరవాణి కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీరవాణి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.
 
మా రక్తంలో ప్రతిరోధకాలు ఇంకా చురుకుగా ఉండటంవల్లే నేను మా కొడుకు రెండోసారి ప్లాస్మా దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మా దానం ఇవ్వడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కీరవాణి వెల్లడించారు.