గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:02 IST)

1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్, అభివృద్ధికి రూ. 2 కోట్లు

ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు ఈరోజు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు బాహుబలి.
 
ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇది. తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్నారు ప్రభాస్. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసారు.
ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన చేసి... మొక్కలు నాటారు సంతోష్, ప్రభాస్. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించారు. త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎం.పీ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.