సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (17:23 IST)

భారత రాజ్యాంగానికి వయసు 7 పదులు.. 26న ప్రత్యేక పార్లమెంట్

భారత రాజ్యాంగానికి 70 యేళ్లు నిండనున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన భారత పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని నరేంద్ర మోడీలు ఎంపీల‌ను ఉద్దేశించి మాట్లాడుతారు. 
 
ఈ ప్రత్యేక సమావేశాలకు ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్యసభ ఛైర్మెన్ వెంక‌య్య‌నాయుడు, లోక్‌సభ స్పీక‌ర్ ఓం బిర్లాలు కూడా సంయుక్త స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారు. మాజీ రాష్ట్ర‌ప‌తులు, ప్ర‌ధానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. 
 
ఉభయ సభల సమావేశం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాలులో జరుగనుంది. స్వాతంత్య్రం వ‌చ్చి 50 ఏళ్లు నిండిన సంద‌ర్భంలోనూ 1997లో అర్థ‌రాత్రి ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించారు. 1949, న‌వంబ‌ర్ 26వ తేదీన భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జ‌న‌వ‌రి 26 నుంచి రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చింది.