శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:14 IST)

హాయ్ కెటిఆర్ అంకుల్ గారు, ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా...

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో పలువురు దాతలు తమ శక్తికొలది విరాళాలు ఇస్తున్నారు.

ఇలాంటివారిలో చిన్నారులు కూడా వుంటున్నారు. తాము దాచుకున్న డబ్బును విరాళంగా ఇస్తున్నారు. తెలంగాణలో ఓ పాప తన పుట్టినరోజు సందర్భంగా రూ. 1124 ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసింది. 
 
ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా ''హాయ్ కెటిఆర్ అంకుల్ గారు, ఈ రోజు నా పుట్టినరోజు, నా పొదుపు డబ్బును మా తల్లిదండ్రులు కిరణ్ లాల్ & చందనా సహకారంతో మా గొప్ప సిఎం కెసిఆర్ తాత సిఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ఇచ్చాను'' అని పేర్కొంది.