మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (14:47 IST)

కర్నాటకలో ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్

కరోనా మహమ్మారి క్రమక్రమంగా విస్తరిస్తుంది. రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాపకింద నీరులా విస్తరిస్తూ పంజా విసురుతోంది.దీంతో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
 కర్ణాటకలో ప్రస్తుతానికి 463 కేసులు నమోదు కాగా వాటిలో 150 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 
 
వైరస్ సోకిన వారిలో 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మృతి చెందిన వాళ్లు 55-80 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటాన్ని గమనించిన సర్కారు రాష్ట్రంలో 55 ఏళ్లు వయస్సు పై బడిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
 
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని పాద్రాయ ణపుర జైలులో ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్ సోకిన ఘటన సంచలనం రేపింది.ఇటీవల ఆరోగ్య కార్యకర్తలపై కొందరు దాడి చేసిన కేసులో నిందితులైన 119 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిని రామనగర ప్రాంతంలోని పాద్రాయణపుర జైలుకు తరలించారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.
 
ఈ జైలు నుంచి మరో 8 మందిని మరో ప్రాంతానికి తరలించారు. దీంతో సిఎం యాడియూరప్ప ఉన్నత స్ధాయి సమావేశాన్ని ఏర్నాటు చేశారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.