1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid 19 Positive for Two more employees in AP Raj Bhavan

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్?!

Covid 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీనికి నిదర్శనమే ఏపీలో కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్‌ స్పాట్‌లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే రాజ్‌భవన్‌లో ఇప్పటికే నలుగురికి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో రాజ్‌భవన్‌ సిబ్బంది, అధికారుల్లో కలకలం మొదలైంది. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్ ప్రాంగణంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో అధికారుల్లో ఆందోళ‌న‌నెల‌కొంది. అక్కడ పనిచేసే ఉద్యోగితో పాటు, 108 అంబులెన్స్‌ డ్రైవరుకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. 
 
గతంలో గవర్నర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్స్‌, ఇద్దరు అటెండర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇపుడు మరో ఇద్దరికి సోకడం ఆందోళన కలిగిస్తోంది.
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
స్నేహితుడు ఫోన్‌లో మాట్లాడటం లేదని యువతి ఆత్మహత్య