1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. evidence shows plasma therapy doesn’t prevent COVID mortality, said ICMR

ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది, ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

evidence
ప్లాస్మా థెరపీ వల్ల కరోనా మరణాలు తగ్గించవచ్చంటూ నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత దానం చేసే ప్లాస్మా వల్ల ప్రాణాలు నిలబడతాయనే ఉద్దేశంతో ప్లాస్మా దానానికి పలువురు ముందుకొచ్చారు .అయితే తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.
 
14 రాష్ట్రాలలోని 39 ఆస్పత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ మరణాలను ప్లాస్మా థెరపీ ఏమాత్రం తగ్గించలేక పోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మరణాలతో పాటు రోగ తీవ్రతను కూడా ఇది తగ్గించలేక పోయిందని పేర్కొన్నారు.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. దీనిపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన అనంతరం అధ్యయనం ప్రచురితం కానుంది.
 
అధ్యయనంలో వెల్లడైన విషయాలను టాస్క్ పోర్స్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త పర్యవేక్షక బృందం పరిశీలించిన అనంతరం ప్లాస్మా థెరపీ విధానాన్ని కొనసాగించాలా, వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని భార్గవ పేర్కొన్నారు.
About Writer
వి
తర్వాతి కథనం
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు