శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (13:53 IST)

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే తయారైంది.. హాంకాంగ్ వైరాలజిస్టు

కరోనా వైరస్‌ను చైనానే పుట్టించిందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డా. లి మెంగ్ యాన్ చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే తయారైందని ఆరోపించారు. తన వాదనలను బలపర్చేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలలో లిమెంగ్ ఒకరు. ఈమె కరోనా వైరస్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమని మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంగతి చైనా ప్రభుత్వానికి ముందే తెలుసని లి మెంగ్ యాంగ్ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా హాంకాంగ్ నుంచి అమెరికాకు తరలివచ్చానని చెప్పారు. ఈ నెల 11న ఓ షోలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనలు తాను ఎదుర్కొంటున్న సవాళ్లను ఆమె పంచుకుంది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాను కరోనా వైరస్‌పై రెండు పరిశోధనలు చేశానని దాని ఫలితాలను ఉన్నతాధికారులతో పంచుకున్నానని తెలిపారు. 
 
డబ్ల్యూహెచ్‌వోతో సంబంధాలు ఉన్న ఆయన చైనా గవర్నమెంట్ తరపున, డబ్ల్యూహెచ్‌వో తరపున ప్రజలకు మంచి జరిగేలా చేస్తారని అనుకున్నానని, కానీ ఆయన తనను సైలెంట్‌గా ఉండమన్నారని..  నిశ్శబ్దంగా ఉండమని, లేకపోతే ఎవరికీ కనిపించకుండా పోతావని హెచ్చరించారు. కానీ దీని గురించి బయటకు చెప్పకుండా ఉండలేకపోయానని అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకపోతే తనను తాను క్షమించుకోలేనని అనిపించిందన్నారు.