శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (16:55 IST)

పార్లమెంట్‌ సమావేశాలు.. కరోనా కలకలం.. ఐదుమంది ఎంపీలకు పాజిటివ్..?

సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కరోనా పరీక్షల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 14 న ప్రారంభమై, అక్టోబర్‌ 1కి ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ఎంపీలందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్టుల్లోనూ ఐదుమంది ఎంపీలకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. దీంతో సమావేశాలకు హాజరైన ఎంపీల్లో కలవరం మొదలైంది. 
 
ఇప్పటివరకు 24మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్‌ సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
 
మరోవైపు ఎంపీలతో పాటు, పార్లమెంటు ఆవరణలోనికి ప్రవేశించే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ సిబ్బంది అంతా సమావేశాల ప్రారంభానికి ముందే పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్‌ కోరారు.